Advertisement

స్కూటర్‌ నుంచి అడ్వెంచర్‌ బైక్‌ వరకు.. హోండా నుంచి 10 కొత్త టూవీలర్లు

Honda announces 10 new two wheelers from scooters to adventure bikes
  • ఏడీవీ160లో ఈ85 ఫ్యూయల్‌ సపోర్ట్‌
  • సీబీ500 ప్రీమియం రోడ్‌స్టర్‌
  • రెబెల్‌ 300, 500 క్రూజర్లు
  • ఎక్స్‌ఆర్‌300ఎల్‌, ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ అడ్వెంచర్‌ బైక్‌లు
  • ఎక్స్‌సీ3 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
  • సీబీ350 సిరీస్‌కు కొత్త రంగులు
భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ఒకేసారి 10 కొత్త టూ-వీలర్లను ప్రకటించింది. వీటిలో ఏడు పూర్తిగా కొత్త మోడళ్లు, మూడు అప్‌డేటెడ్‌ బైక్‌లు ఉన్నాయి. స్కూటర్‌, రోడ్‌స్టర్‌, క్రూజర్‌, అడ్వెంచర్‌, ఎలక్ట్రిక్‌, ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చింది. ధరలు, విడుదల తేదీలను దశలవారీగా ప్రకటించనున్నట్లు తెలిపింది.

ఏడీవీ 160: నగర ప్రయాణాలతో పాటు అడ్వెంచర్‌ రైడింగ్‌కు అనువుగా రూపొందించిన 160 సీసీ స్కూటర్‌. 27 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌, 8.1 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ దీని ప్రత్యేకతలు. ఈ85 ఇంధనానికి సపోర్ట్‌ చేసే భారత తొలి స్కూటర్‌గా హోండా పేర్కొంది.

సీబీ500: రెట్రో డిజైన్‌తో కూడిన ప్రీమియం రోడ్‌స్టర్‌. 501 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది. అలాయ్‌, స్పోక్‌ ట్యూబ్‌లెస్‌, గ్రాఫిక్స్‌తో కూడిన స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

రెబెల్‌ 300: లైఫ్‌స్టైల్‌ క్రూజర్‌గా రూపొందించిన ఈ బైక్‌లో 286 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. స్టాండర్డ్‌, ఈ-క్లచ్‌ వేరియంట్లలో విడుదల కానుంది. బాబర్‌ స్టైల్‌, తక్కువ సీటు ఎత్తు దీని ఆకర్షణ.

రెబెల్‌ 500: రెబెల్‌ 300 డిజైన్‌కే పెద్ద ఇంజిన్‌ను జోడించారు. ఇందులో 471 సీసీ ట్విన్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఎక్కువ పవర్‌ కోరుకునే క్రూజర్‌ ప్రియులను లక్ష్యంగా రూపొందించారు.

ఎక్స్‌ఆర్‌300ఎల్‌: ఆఫ్‌రోడ్‌, రోజువారీ ప్రయాణాలకు సరిపోయే డ్యూయల్‌ పర్పస్‌ బైక్‌. 293.5 సీసీ ఇంజిన్‌, లాంగ్‌ ట్రావెల్‌ సస్పెన్షన్‌తో వస్తుంది. తక్కువ బరువు, సులభమైన హ్యాండ్లింగ్‌ దీని ప్రత్యేకత.

ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ: అడ్వెంచర్‌ టూరింగ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్‌. ర్యాలీ స్టైల్‌ డిజైన్‌తో పాటు మిశ్రమ రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించేలా అభివృద్ధి చేశారు. లాంగ్‌ రైడ్‌లను ఇష్టపడేవారిని టార్గెట్‌ చేసింది.

క్యూసీ3 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌: కుటుంబ అవసరాలకు అనువైన ఈవీ స్కూటర్‌. 3kWh బ్యాటరీ, 151 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌, 32 లీటర్ల స్టోరేజ్‌ సామర్థ్యంతో వస్తుంది.

అదనంగా సీబీ350, సీబీ350సీ, సీబీ350ఆర్‌ఎస్‌ మోడళ్లను కొత్త రంగులతో అప్‌డేట్‌ చేసింది. ఈ మూడు బైక్‌లలో యాంత్రిక మార్పులు లేకుండా కొత్త కలర్‌ ఆప్షన్లు మాత్రమే అందిస్తోంది.
Advertisement
Honda
Honda New Bikes India
Honda ADV 160
Honda Rebel 300
Honda QC3 Electric Scooter
Honda XR300 Rally

More Telugu News