రజత్ పటీదార్‌కు అన్యాయం జరిగిందా?.. సెలక్టర్ల తీరుపై హనుమ విహారి అసంతృప్తి!
- రజత్ పటీదార్‌ను ఎంపిక చేయకపోవడంపై హనుమ విహారి ఆగ్రహం.
- కుల్‌దీప్ యాదవ్, సంజూ శాంసన్‌లకు చోటు దక్కకపోవడంపై ప్రశ్నలు
- జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లే ఎక్కువగా ఉన్నారని కామెంట్
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ ఘనవిజయంతో ప్రారంభించినప్పటికీ.. మ్యాచ్ వెనుక జట్టు ఎంపికపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది! ఆర్‌సీబీ కెప్టెన్‌గా రాణించిన రజత్ పటీదార్‌ను పక్కనబెట్టడం పట్ల టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ హనుమ విహారి విమర్శలు గుప్పించాడు.
హరారే వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో జింబాబ్వేను 125/7 పరుగులకే నిరోధించిన భారత్, 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే ధనాధన్ అర్ధశతకం సాధించి అంతర్జాతీయ టీ20ల్లో అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) నిప్పులు చెరిగారు. అయితే, ఈ గ్రాండ్ విక్టరీ తర్వాత కూడా సెలక్టర్ల నిర్ణయాలపై విహారి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీని ముందుండి నడిపించడమే కాకుండా 196.76 స్ట్రైక్ రేట్‌తో 486 పరుగులు చేసిన పటీదార్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని విహారి ప్రశ్నించారు. "జట్టు నిండా ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే నింపేశారు. శ్రేయస్ అయ్యర్ మినహా సరైన కుడిచేతి వాటం బ్యాటరే లేరు. పటీదార్ లేదా సంజూ శాంసన్ వంటి కుడిచేతి వాటం ఆటగాళ్లు ఉంటే జట్టు బ్యాలెన్స్‌డ్ గా ఉండేది. వయసును మాత్రమే కొలమానంగా తీసుకుని అనుభవాన్ని, ప్రదర్శనను పక్కనబెట్టడం సరికాదు" అని ఆయన అభిప్రాయపడ్డాడు. అలాగే స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను తప్పించడంపై కూడా విహారి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.