6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఐకూ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లివే!
- రూ.17,999 ప్రారంభ ధరతో ఐకూ జెడ్11 లైట్
- 6,500ఎంఏహెచ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
- 50ఎంపీ ప్రధాన కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్6
- ఐపీ65 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ
- జులై 30 నుంచి విక్రయాలు ప్రారంభం
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీని మరింత పెంచేలా ఐకూ భారత మార్కెట్లో ‘జెడ్11 లైట్ 5జీ’ని విడుదల చేసింది. ఏఐ ఫీచర్లు, 6,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. జులై 30 నుంచి అమెజాన్‌తో పాటు ఐకూ ఈ-స్టోర్, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ధర విషయానికి వస్తే.. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499, 6జీబీ+128జీబీ రూ.21,499, 6జీబీ+256జీబీ రూ.24,499గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ప్రారంభ ధర రూ.17,999కు అందుబాటులోకి రానుంది. అలాగే మూడు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్ రంగుల్లో లభించనుంది.
ఫీచర్ల పరంగా చూస్తే.. 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు గరిష్ఠంగా 6జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్ అందించారు. అదనంగా 6జీబీ వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్6పై పనిచేస్తుంది.
కెమెరా విభాగంలో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్852 ప్రధాన కెమెరాతో పాటు 0.08ఎంపీ సెకండరీ సెన్సార్, ముందు భాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. నైట్ మోడ్, పోర్ట్రెయిట్, పనోరమా, స్లో మోషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 44W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ65 డస్ట్-వాటర్ రెసిస్టెన్స్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.