నిటారుగా నిద్రపోయే తిమింగలాలు.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపర్చిన రహస్యం
- స్పెర్మ్ వేల్‌లపై కొత్త అధ్యయనం
- నిటారుగా నిల్చునే నిద్ర
- గాలి బుడగలతో బ్యాలెన్స్
- ఉపరితలానికి దగ్గరగా విశ్రాంతి
- ఇందులో స్పెర్మాసెటి ఆయిల్ కీలక పాత్ర
- నిద్రలోనూ బుడగల నియంత్రణ
సముద్ర జీవుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అప్పుడప్పుడూ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు వాటి జీవితంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెడుతుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద దంతాలున్న తిమింగలాల్లో ఒకటైన ‘స్పెర్మ్ వేల్’ నిద్రపోయే తీరు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. మనుషులు, భూమిపై ఉండే జంతువుల మాదిరిగా కాకుండా ఇవి సముద్రంలో నిటారుగా నిల్చున్నట్టే నిద్రపోతాయని గుర్తించారు. ఆ సమయంలో నీటిలో తేలుతూ ఉండేందుకు చిన్న చిన్న గాలి బుడగలను విడుదల చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ న్యూషాటెల్ శాస్త్రవేత్తలు నార్వే తీరంలో స్పెర్మ్ వేల్‌లపై ప్రత్యేక సక్షన్-కప్ ట్యాగ్‌లను అమర్చి వాటి కదలికలు, శబ్దాలను రికార్డు చేశారు. ఈ డేటాను విశ్లేషించగా, విశ్రాంతి సమయంలో తిమింగలాలు దాదాపు కదలకుండా నీటిలో నిటారుగా నిలిచి ఉంటాయని గుర్తించారు. తల నీటి ఉపరితలం వైపు ఉండగా, శరీరం కిందికి వేలాడుతూ ఉండే ఈ భంగిమ ఇతర తిమింగలాల్లో కనిపించదని పరిశోధకులు తెలిపారు.
ఈ భంగిమ వల్ల వాటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేచిన వెంటనే శ్వాస తీసుకునేందుకు ఉపరితలానికి దగ్గరగా ఉండటం సులభమవుతుంది. అలాగే సముద్ర అలల ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు లోతైన నీటిలోకి కొట్టుకుపోకుండా శక్తిని ఆదా చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రత్యేకమైన నిద్ర భంగిమను అవి ఎంచుకుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
స్పెర్మ్ వేల్‌ల తలలో స్పెర్మాసెటి ఆయిల్ అనే మైనంలాంటి పదార్థంతో నిండిన ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది అవి తేలడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విశ్రాంతి సమయంలో ఊపిరితిత్తుల్లోని వాయువు విస్తరించడంతో అవి పైకి తేలే అవకాశం ఉంటుంది. దీనిని సమతుల్యం చేసేందుకు అవి చిన్న చిన్న గాలి బుడగలను విడుదల చేస్తాయి. దీంతో నీటిలో దాదాపు బరువులేనట్టుగా స్థిరంగా తేలుతూ నిద్రపోగలుగుతాయి.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ సూక్ష్మ సమతుల్యతను స్పెర్మ్ వేల్‌లు నిద్రలోనే నియంత్రించగలగడం. భూమిపై ఉండే జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన ఇప్పటివరకు కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ గాలి బుడగలు శరీరంలోని అదనపు కార్బన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్‌ను బయటకు పంపడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే సముద్ర గర్భంలో తిమింగలాల జీవన విధానం గురించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.