రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి... వీడియో వైరల్

Man lifts his bike to cross a railway gate
బైక్ ఎంత లేదన్నా 150 కిలోల పైనే బరువుంటుంది. ఒక్కోసారి బైక్ పై కూర్చుని, రెండు కాళ్లు కింద పెట్టినా ఆ బరువు ఆపలేకపోతుంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బైక్ ను భుజంపైకి ఎత్తుకుని మోసేశాడు. ఢిల్లీ వద్ద జరిగిందీ ఘటన. 

రైలు వస్తుండడంతో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడింది. అంతలో అటుగా వచ్చిన ఓ బైక్ వాలా... రైలు వచ్చేంత వరకు వేచి చూడడం సమయం వృథా అనుకున్నాడు... వెంటనే బైక్ ను భుజానికి ఎత్తుకుని రైల్వే గేటు దాటాడు. 

జనాలు నివ్వెరపోయి చూస్తూ ఉండగా, బైక్ ను మోసుకుంటూ బాహుబలిలా నడిచివెళ్లాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Man Lifts Bike
Railway Crossing
New Delhi
Video

More Telugu News