కుమారుడితో కలిసి హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని
- గోడౌన్ లో పీడీఎస్ బియ్యం మాయం
- ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబం
- ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పేర్ని జయసుధ
- ఇటీవల పేర్ని నాని, పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)లకు పోలీసుల నోటీసులు
- నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో పేర్ని నాని, కిట్టు క్వాష్ పిటిషన్లు
ఇక, ఈ కేసులో విచారణకు రావాలంటూ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)లకు పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయితే, పేర్ని నాని, ఆయన తనయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల నోటీసులను రద్దు చేయాలంటూ వారిరువురు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు రేపు (డిసెంబరు 24) విచారణ చేపట్టనుంది.