మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరో చెప్పేసిన బీజేపీ నేత
- బీజేపీ సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ దాటనున్నట్లు ట్రెండ్స్
- 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల లీడ్
- సీఎం కుర్చీపై వీడిన పీటముడి?
దీనిపై చర్చించేందుకు మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే కాసేపట్లో ఫడ్నవీస్ ను కలవనున్నట్లు సమాచారం. కూటమి గెలిస్తే సీఎం కుర్చీ ఎవరు చేపడతారనే విషయంపై శనివారం ఉదయం వరకు సందిగ్ధత కొనసాగింది. బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) పార్టీల నేతలంతా తమ నాయకుడే సీఎం అవుతారంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే, బీజేపీ సింగిల్ గానే మెజారిటీ వైపు దూసుకెళుతుండడంతో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. కాగా, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.