Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ

Padmanabha Reddy letter to CM Revanth Reddy
  • 2016లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ నియామకాలు జరగలేదని వెల్లడి
  • ఎనిమిదేళ్ల క్రితమే ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్య
  • మున్సిపల్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ లేఖ రాశారు. 2016లో ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరగలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నియామకాలు జరపకపోవడంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు.

కొందరు బిల్డర్లు అక్రమ కట్టడాలను కట్టి విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలను కొని సామాన్యులు మోసపోతున్నారని తెలిపారు. అక్రమ కట్టడాల నిరోధానికే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉండకపోయేవన్నారు. కాబట్టి, తక్షణమే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించాలని ఆ లేఖలో కోరారు.
Advertisement
Revanth Reddy
PadmanabhaReddy
Telangana

More Telugu News