ఇల్లు, క్యాంపు కార్యాల‌యం కోసం.. పిఠాపురంలో మ‌రో 12 ఎక‌రాలు కొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్

Deputy CM Pawan Kalyan Buys 12 Acres in Pithapuram
  • ఎన్నిక‌ల ముందు పిఠాపురంలో ఇల్లు క‌ట్టుకుంటాన‌ని అక్క‌డి ప్ర‌జ‌లకు మాటిచ్చిన‌ జ‌న‌సేనాని
  • ఆ మాట ప్ర‌కారం జులైలో ఇల్లింద్రాడ‌, భోగాపురంలో వ‌రుస‌గా 2.08, 1.44 ఎక‌రాల కొనుగోలు
  • ఇప్పుడు గ‌తంలో కొన్న‌చోటే మ‌రో 12 ఎక‌రాలు కొనుగోలు చేసిన ప‌వ‌న్
ఇల్లు, క్యాంపు కార్యాల‌యం నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో మ‌రో 12 ఎక‌రాల స్థ‌లం కొనుగోలు చేశారు. ఎన్నిక‌ల ముందు పిఠాపురంలో ఇల్లు క‌ట్టుకుంటాన‌ని అక్క‌డి ప్ర‌జ‌లకు జ‌న‌సేనాని మాటిచ్చారు. అందులో భాగంగానే జులైలో ఇల్లింద్రాడ‌, భోగాపురంలో వ‌రుస‌గా 2.08, 1.44 ఎక‌రాలు కొనుగోలు చేశారు. 

సోమ‌వారం పిఠాపురంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ గ‌తంలో కొన్న‌చోటే మ‌రోసారి 12 ఎక‌రాలు కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేష‌న్‌ను ఆయ‌న త‌ర‌ఫున రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ తోట సుధీర్ మంగ‌ళ‌వారం పూర్తి చేయ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఈ స్థ‌లంలో ఇల్లు, క్యాంపు కార్యాల‌యం నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.
Go Back to Shorts
Pawan Kalyan
Pithapuram
Andhra Pradesh
Janasena

More Telugu News