సనాతన ధర్మాన్ని తానే కనుగొన్నట్టు పవన్ మాట్లాడుతున్నారు: వెల్లంపల్లి

Vellampalli take a dig at Pawan Kalyan
  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి నేతలు వర్సెస్ వైసీపీ నేతలు
  • చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడన్న వెల్లంపల్లి
  • ఎవరైనా చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారా? అంటూ విమర్శలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో కూటమి నేతలకు, వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. హిందూ సనాతన ధర్మాన్ని కొత్తగా తానే కనుగొన్నట్టు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. 

పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని... తిరుపతి లడ్డూలపై  చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడని అన్నారు. 

అయినా, దీక్ష చేసేవాళ్లు చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారా? దీక్ష చేసేవాళ్లు సినిమాలు చేయొచ్చా? ఇదేనా పవన్ చిత్తశుద్ధి? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ పవన్ రాజకీయాలు చేస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. 
Go Back to Shorts
Vellampalli Srinivasa Rao
Pawan Kalyan
Sanatan Dharma
Tirupati Laddu
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News