మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. ఆసుపత్రికి తరలింపు

Sukhbir Singh Badal attacked with swords in Nanded Maharashtra and rushed to hospital
  • గురుద్వారా మాతా సాహిబ్ దర్శనం కోసం కుటుంబ సమేతంగా వెళ్లిన బాదల్
  • కత్తితో దాడి చేసిన నిహాంగ్ సిక్కు వ్యక్తి
  • బాదల్ చేతికి, భుజానికి తీవ్ర గాయాలు

శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దర్శనం కోసం కుటుంబ సమేతంగా వెళ్లిన సమయంలో, ఓ నిహాంగ్ సిక్కు వ్యక్తి పదునైన ఆయుధంతో ఆయనపై హఠాత్తుగా విరుచుకుపడ్డాడు.


అతడు కత్తితో దాడి చేయడంతో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేతికి గాయాలయ్యాయి. ఆయన రక్షణగా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి కూడా ఈ ఘటనలో గాయాలైనట్టు తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే Z-ప్లస్ కేటగిరీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని అడ్డుకున్నారు. అనంతరం గాయపడిన సుఖ్‌బీర్ బాదల్‌ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.


దాడికి పాల్పడిన నిహాంగ్ సిక్కు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. నాందేడ్‌లోని గురుద్వారా ప్రాంగణంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర కలకలం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Sukhbir Singh Badal
Nanded sword attack
Shiromani Akali Dal
Nihang Sikhs
Maharashtra news
Punjab former Deputy CM

More Telugu News