ఆర్జీ కర్ బాధితురాలి మృతదేహం హడావుడి దహనం: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ అరెస్ట్

Nirmal Ghosh arrested for hurried cremation of RG Kar victim body
  • కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య
  • బాధితురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారంటూ టీఎంసీ మాజీ ఎమ్మెల్యేపై కేసు
  • ఒడిశాలోని సంబల్‌పూర్‌లో నిర్మల్ ఘోష్ అరెస్ట్

కోల్‌కతాలోని ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ అత్యాచారం, హత్య ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారనే తీవ్ర ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను పోలీసులు ఒడిశాలోని సంబల్‌పూర్‌లో అరెస్టు చేశారు.


రెండవ పోస్ట్‌మార్టం జరగకుండా అడ్డుకోవడానికే, సాక్ష్యాధారాలను తుడిచిపెట్టే కుట్రలో భాగంగా కుటుంబ సభ్యుల ముందస్తు అనుమతి, సంతకాలు లేకుండానే నిర్మల్ ఘోష్ అండ్ టీమ్ దహన సంస్కారాలు పూర్తి చేయించారని బాధితురాలి తండ్రి ఖర్దా పోలీస్ స్టేషన్‌లో కొత్తగా ఫిర్యాదు చేశారు. దహన పత్రాలపై కుటుంబ సభ్యులకు బదులు పొరుగువారి సంతకాలు తీసుకుని, ఇతర మృతదేహాలను పక్కనబెట్టి మరీ అత్యంత వేగంగా ఈ ప్రక్రియను ముగించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్ష్యాధారాల విధ్వంసం, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement
Nirmal Ghosh
RG Kar Medical College
Kolkata Doctor Case
TMC MLA Arrested
Evidence Tampering
Trainee Doctor Murder

More Telugu News