పిఠాపురంలో భారీ జాబ్‌మేళా .. 783 మందికి ఉద్యోగాలు
- పిఠాపురంలో మెగా జాబ్‌మేళాకు హజరైన 2,700 మంది యువతీ యువకులు
- ఇంటర్వ్యూలు నిర్వహించిన 40 కంపెనీల ప్రతినిధులు
- 783 మందికి నియామక ఉత్తర్వులు
ఎంపికైన వారికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నియామక ఉత్తర్వులు అందజేశారు. జాబ్‌మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులకు నిర్వహకులు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. నిరంతరాయంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.