మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ
- మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ కు ఎంఎస్ ధోనీ ప్రచారం
- ధోనీ నిజాయతీ, నిలకడ తమ విలువలకు ప్రతిబింబమన్న మలబార్ యాజమాన్యం
- టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమం
- మలబార్ పారదర్శకత, నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని చెప్పిన ధోనీ
ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని నియమించుకున్నట్లు ప్రకటించింది. 'ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్' అనే తమ బ్రాండ్ ఫిలాసఫీని బలోపేతం చేయడంలో భాగంగా ఈ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ముంబైలో తెలిపింది.
వినియోగదారులు పారదర్శకత, విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ తరుణంలో, తమ నిబద్ధతను చాటుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలబార్ గోల్డ్ పేర్కొంది. నైతిక వ్యాపార పద్ధతులు, నాణ్యత, పారదర్శక ధరలు, కస్టమర్-ఫస్ట్ విధానాల ద్వారా ప్రతి కొనుగోలులోనూ నమ్మకాన్ని అందించడమే తమ లక్ష్యమని వివరించింది.
భారత జట్టుకు మూడు ఐసీసీ వైట్-బాల్ టోర్నమెంట్‌లలో టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ... తన నిజాయతీ, క్రమశిక్షణ, నిలకడతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. ధోనీ వ్యక్తిత్వం తమ 33 ఏళ్ల బ్రాండ్ విలువలకు అద్దం పడుతుందని సంస్థ అభిప్రాయపడింది. ఈ ఒప్పందంలో భాగంగా టెలివిజన్, ప్రింట్, డిజిటల్ వంటి అన్ని మాధ్యమాల్లో భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది.
ఈ భాగస్వామ్యంపై మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎంపీ అహమ్మద్ మాట్లాడుతూ... "వినియోగదారులు తాము ఎంచుకునే బ్రాండ్ల నుంచి కేవలం ఉత్పత్తులనే కాదు, పారదర్శకతను, విశ్వసనీయతను కూడా ఆశిస్తున్నారు. ధోనీ నిజాయతీ, నిలకడ మా విలువలకి సరిగ్గా సరిపోతాయి. ఆయన రాకతో మా బ్రాండ్‌పై వినియోగదారులకు మరింత నమ్మకం కలుగుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.
ఈ ఒప్పందంపై ఎంఎస్ ధోనీ స్పందిస్తూ... "విశ్వాసం అనేది మాటలతో కాదు, చేతలతో, నిలకడతో సంపాదించుకోవాలని నేను నమ్ముతాను. పారదర్శకత, బాధ్యత పట్ల మలబార్ గోల్డ్ చూపిస్తున్న నిబద్ధత నన్ను ఆకట్టుకుంది. ఈ ప్రయాణంలో వారితో కలిసి పనిచేయడం నాకు సంతోషంగా ఉంది" అని తెలిపాడు.