'శ్రీనివాస మంగాపురం' రన్ టైమ్ ఇదే!

Srinivasa Mangapuram Movie Runtime Details Revealed
  • 'శ్రీనివాస మంగాపురం' సినిమా రన్‌టైమ్ ఖరారు
  • మొత్తం 2 గంటల 35 నిమిషాల నిడివితో చిత్రం
  • అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ
  • ఘట్టమనేని జైకృష్ణ హీరోగా పరిచయం
  • జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
ఒక సినిమా కథలో దర్శకుడికి ఎంత నమ్మకం, స్పష్టత ఉన్నాయో చెప్పడానికి ఆ చిత్ర నిడివి కూడా ఒక నిదర్శనంగా నిలుస్తుంది. తాజాగా, దర్శకుడు అజయ్ భూపతి తన కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకులను పలకరించనుంది. "సీజన్‌లోనే అత్యంత గాఢమైన ప్రేమకథ" (Most intense love story) అని ప్రచారం చేస్తున్న ఈ చిత్రానికి ఇంత నిడివిని లాక్ చేయడం, కథపై యూనిట్‌కు ఉన్న గట్టి నమ్మకాన్ని తెలియజేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

‘RX 100’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన చిత్రాలంటేనే రా, రస్టిక్ భావోద్వేగాలకు పెట్టింది పేరు. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రేమకథతో వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఈ చిత్రంతో ఘట్టమనేని కుటుంబం నుంచి జైకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం కానుండటం మరో ప్రధాన ఆకర్షణ. ఇదే సినిమాతో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కూడా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్స్ ద్వారా జయకృష్ణ ఘట్టమనేని, రాషా కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.

టాలీవుడ్ లెజెండరీ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం సినిమా స్థాయిని పెంచుతోంది. చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పి పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భావోద్వేగభరితమైన కథలకు తన సంగీతంతో ప్రాణం పోసే ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

అజయ్ భూపతి మార్క్ టేకింగ్, ఘట్టమనేని వారసుడి అరంగేట్రం, అశ్వనీదత్ సమర్పణ వంటి బలమైన అంశాలతో వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాన్ని జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
Advertisement
Srinivasa Mangapuram
Ajay Bhupathi
Jai Krishna Ghattamaneni
Rasha Thadani
Srinivasa Mangapuram Runtime
Mohan Babu

More Telugu News