ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన బీబీసీ బృందం
- బీబీసీ న్యూస్ తెలుగు బృందంతో మంత్రి నారా లోకేశ్ భేటీ
- భారత్‌లో మహిళల క్రీడలపై రూపొందించిన సర్వే వెల్లడి
- తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ ఆడే మహిళలు మూడింతలు పెరిగారని గుర్తింపు
- 2020లో 3 శాతం ఉన్న సంఖ్య ఇప్పుడు 9 శాతానికి చేరినట్లు సర్వేలో వెల్లడి
- మహిళా క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని లోకేశ్ హామీ
తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ ఆడే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. బీబీసీ న్యూస్ తెలుగు అసిస్టెంట్ ఎడిటర్ అనిల్ కుమార్, కలెక్టివ్ న్యూస్‌రూమ్ బృందం ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు భారత్‌లో మహిళల క్రీడలపై నిర్వహించిన సర్వే వివరాలను లోకేశ్‌కు అందించారు.
ఈ సర్వేలోని పలు అంశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో 2020 నుంచి ఇప్పటివరకు బ్యాడ్మింటన్ ఆడే మహిళల సంఖ్య మూడింతలు పెరిగిందని సర్వేలో తేలింది. 2020లో కేవలం 3 శాతంగా ఉన్న ఈ సంఖ్య, ఇప్పుడు 9 శాతానికి చేరినట్లు బీబీసీ బృందం వివరించింది.
ఈ సర్వే ఫలితాలపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో క్రీడాకారులకు, ముఖ్యంగా యువతులకు మరిన్ని అవకాశాలు, మెరుగైన మౌలిక వసతులు, బలమైన మద్దతు వ్యవస్థలను సృష్టించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రీడల్లో రాణించాలనే కల ఉన్న ప్రతి అమ్మాయికి అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని లోకేశ్ తెలిపారు.