ఓ ఇంటివాడైన టీమిండియా యువ క్రికెటర్

Team India Young Cricketer Jitesh Sharma Marries Shalaka Makeshwar
  • పెళ్లి చేసుకున్న‌ టీ20 స్పెష‌లిస్ట్ జితేశ్ శ‌ర్మ
  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ష‌ల‌క ముకేశ్వ‌ర్‌ను ప‌రిణ‌య‌మాడిన యువ క్రికెట‌ర్‌
  • ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పెళ్లి వేడుక ఫొటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్న జితేశ్
భార‌త యువ క్రికెట‌ర్ జితేశ్ శ‌ర్మ పెళ్లి చేసుకున్నాడు. టీ20 స్పెష‌లిస్ట్‌గా పేరొందిన జితేశ్ శుక్రవారం ఓ ఇంటివాడ‌య్యాడు. వేద పండితుల ఆశీర్వ‌చ‌నాల మ‌ధ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ష‌ల‌క ముకేశ్వ‌ర్‌ను పెళ్లాడాడు. కేవ‌లం ఇరువురి కుటుంబాలు మాత్ర‌మే ఈ వేడుకకు హ‌జ‌ర‌య్యాయి. ఇలా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వైభ‌వంగా వీరి ప‌రిణ‌యం జ‌రిగింది.

త‌మ పెళ్లి వేడుక ఫొటోల‌ను జితేశ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. ‘ఈ క్రేజీ ప్ర‌పంచంలో 8.8.8న‌ మ‌నం ఒక‌రికొక‌రం దొరికాం’ అంటూ ఆ ఫొటోల‌కు జితేశ్ క్యాప్ష‌న్ ఇచ్చాడు. దాంతో ఈ నూత‌న వ‌ధూవ‌రుల ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అయ్యాయి. 

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ్ శివం దూబేలతో పాటు ప‌లువురు క్రికెట‌ర్లు జితేశ్ దంప‌తుల‌కు విషెస్ తెలిపారు.

ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఈ యువ బ్యాట‌ర్‌, వికెట్ కీప‌ర్ భార‌త్ త‌ర‌ఫున‌ ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది టీ20లు ఆడాడు. తాజాగా జింబాబ్వేతో జ‌రిగిన టీ20 సిరీస్‌లోనూ జితేశ్ రాణించాడు.
Go Back to Shorts
Jitesh Sharma
Team India
Cricketer
Sports News
Marriage

More Telugu News