రాజ్ తరుణ్‌పై లావణ్య రెండోసారి ఆధారాలతో ఫిర్యాదు చేశారు: డీసీపీ శ్రీనివాస్

DCP srinivas on case against Raj Tharun
  • ఆధారాలు అందించాలని లావణ్యకు నోటీసులు ఇచ్చామన్న డీసీపీ
  • దీంతో లావణ్య మరోసారి ఫిర్యాదు చేశారని వెల్లడి
  • రాజ్ తరుణ్‌పై సెక్షన్ 493 కింద కేసు నమోదు 
సినీ నటుడు రాజ్ తరుణ్‌పై లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదని అందుకే ఆధారాలు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆమె రెండోసారి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో రాజ్ తరుణ్‌పై సెక్షన్ 493 కింద కేసు నమోదు చేశామన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని లావణ్య నిన్న మరో ఫిర్యాదు చేసిందన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. పదేళ్లుగా తనతో కాపురం చేసినట్లు ఆమె చెప్పిందన్నారు. రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అబార్షన్ చేయించాడు: లావణ్య

రాజ్ తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితం పెళ్లయినట్లు లావణ్య తెలిపారు. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు ఆబార్షన్ చేయించారన్నారు. మెడికల్ డాక్యుమెంట్లను తాను పోలీసులకు అందించినట్లు చెప్పారు. లావణ్య అలియాస్ అన్విక పేరుతో తాము కలిసి ఉన్నట్లు చెప్పారు. అన్విక పేరుతో తాము విదేశాలకు వెళ్లామన్నారు. మాల్వీ వచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని ఆరోపించారు. మాల్వీ కోసం అతను ముంబై వెళ్లాడని, దీనిపై నిలదీయడంతో తనను దూరం పెట్టాడన్నారు.
Advertisement
Raj Tharun
Lavanya
Hyderabad
Tollywood

More Telugu News