భారత్ గురించి ప్రపంచం ఏమనుకుంటోంది? 36 దేశాల సర్వేలో ఆసక్తికర విషయాలు!
- 36 దేశాల సర్వేలో భారత్‌కు 45 శాతం సానుకూలత
- శ్రీలంకలో భారత్‌కు అత్యధికంగా 79 శాతం మద్దతు
- పాకిస్థాన్‌లో 91 శాతం మందికి భారత్‌పై వ్యతిరేకత
- కెన్యా, బ్రిటన్‌లో భారత్‌కు 71 శాతం సానుకూలత
- అమెరికాలో 50 శాతం మంది భారత్‌పై ప్రతికూలత
ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ఎలా ఉంది? మన దేశంపై ఎవరికెంత అభిమానం? ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? ఈ ప్రశ్నలకు తాజాగా విడుదలైన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వే ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. 36 దేశాల్లో 42 వేల మందికిపైగా అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వేలో.. భారత్‌పై సానుకూలతే ఎక్కువగా కనిపించింది.
ఈ దేశాల్లో భారత్‌పై సగటున 45 శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. 41 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. భారత్‌కు అత్యధిక మద్దతు శ్రీలంకలో కనిపించింది. అక్కడ ఏకంగా 79 శాతం మంది భారత్‌పై సానుకూల అభిప్రాయం వెల్లడించారు. కేవలం 11 శాతం మందే వ్యతిరేకంగా స్పందించారు. 2024లో భారత్‌పై సానుకూలంగా ఉన్న శ్రీలంక వాసుల సంఖ్య 65 శాతం కాగా.. ఇప్పుడు అది 79 శాతానికి పెరిగింది.
కెన్యాలో 71 శాతం, బ్రిటన్‌లో 71 శాతం, జర్మనీలో 63 శాతం, ఇజ్రాయెల్‌లో 60 శాతం, ఇటలీలో 56 శాతం, స్వీడన్‌లో 55 శాతం మంది భారత్‌పై సానుకూలంగా ఉన్నారు. జపాన్‌లో 55 శాతం, థాయ్‌లాండ్‌లో 55 శాతం, సింగపూర్‌లో 51 శాతం, ఇండోనేషియాలో 50 శాతం మంది భారత్‌ను సానుకూల దేశంగా భావిస్తున్నారు.
అయితే పాకిస్థాన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ 91 శాతం మంది భారత్‌పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 7 శాతం మందే సానుకూలంగా స్పందించారు. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.
బంగ్లాదేశ్‌లో 42 శాతం మంది భారత్‌కు అనుకూలంగా ఉండగా.. 51 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికాలో అభిప్రాయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. 50 శాతం మంది భారత్‌పై ప్రతికూలంగా స్పందించగా.. 45 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. 2023లో భారత్‌పై సానుకూలంగా ఉన్న అమెరికన్ల సంఖ్య 51 శాతం ఉండగా.. 2026లో 45 శాతానికి తగ్గింది.
మొత్తంగా చూస్తే ఆసియా, ఆఫ్రికాలో భారత్‌కు మంచి ఆదరణ కనిపించింది. యూరప్, అమెరికాలో మాత్రం అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. పొరుగు దేశాల్లో పాకిస్థాన్ అత్యంత ప్రతికూల వైఖరితో ప్రత్యేకంగా నిలిచింది.