నిమ్స్ వైద్యుడు డాక్టర్ తిరుమల్‌కు అంతర్జాతీయ ఖ్యాతి.. అమెరికాలో అరుదైన గౌరవం
- యూసీఎఫ్ 'సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్'కు ఎంపికైన డాక్టర్ తిరుమల్
- న్యూరో సర్జరీ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్
- ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రత్యేక అతిథిగా హాజరు
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ ఎర్రగుంట, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా (యూసీఎఫ్) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్' కార్యక్రమానికి ఎంపికయ్యారు. న్యూరో సర్జరీ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు.
ఆగస్టు 9 నుంచి 16 వరకు జరిగే ఈ అకడమిక్ కార్యక్రమంలో డాక్టర్ తిరుమల్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన యూసీఎఫ్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఉపన్యాసం ఇస్తారు. వర్సిటీ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశమై ఆధునిక వైద్య విద్య, న్యూరో సర్జరీలో సరికొత్త పద్ధతులు, వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. భారత్, అమెరికా విద్యా సంస్థల మధ్య సహకారంపై కూడా చర్చలు జరుపుతారు. అంతేకాకుండా, ఆగస్టు 15న ఓర్లాండోలోని ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో జరిగే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
డాక్టర్ తిరుమల్‌కు న్యూరో సర్జరీలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. బయోపోర్టల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్కల్ బేస్ సర్జరీ వంటి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఆయన నిష్ణాతులు. రోగి మెలకువగా ఉండగానే చేసే అరుదైన బ్రెయిన్ సర్జరీలలో (అవేక్ న్యూరో సర్జికల్ ప్రొసీజర్స్) కూడా ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. వైద్య వృత్తితో పాటు సాహస క్రీడల పట్ల కూడా డాక్టర్ తిరుమల్‌కు ఆసక్తి ఉంది. ఆయన 31 మీటర్ల లోతు వరకు సముద్రంలో డైవింగ్ చేయగల సర్టిఫైడ్ స్కూబా డైవర్ కావడం విశేషం.