ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన చంద్రబాబు
- రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
- మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసిన టీడీపీ అధినేత
- ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పును వివరించిన చంద్రబాబు
ఉదయం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై... శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను కూటమి నేతలు గవర్నర్‌కు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్... చంద్రబాబును ఆహ్వానించారు.


