ఒక్క రెడ్ కార్డ్.. 1 మిలియన్ డాలర్ల ఉచిత పిజ్జాలు.. డొమినోస్ బంపరాఫర్!
- ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా ఆటగాడికి రెడ్ కార్డ్
- ఫ్యాన్స్‌కు 1 మిలియన్ డాలర్ల విలువైన ఉచిత పిజ్జాలు ప్రకటించిన డొమినోస్
- టోర్నమెంట్‌కు ముందే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న సంస్థ
- జూన్ 10లోపు రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడి
- రెడ్ కార్డ్ ఎదురైనా మ్యాచ్ గెలిచి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లిన యూఎస్
అయితే, ఇది డొమినోస్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ఏడాది మే నెలలోనే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, డొమినోస్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. వరల్డ్ కప్‌లో అమెరికా జట్టు ఆటగాళ్లలో ఎవరికైనా రెడ్ కార్డ్ ఇస్తే, అభిమానుల నిరాశను తగ్గించేందుకు 1 మిలియన్ డాలర్ల విలువైన పిజ్జాలను ఉచితంగా పంపిణీ చేస్తామని వాగ్దానం చేసింది. ఇందులో భాగంగా 60,000కు పైగా మీడియం పిజ్జాలను అందించనుంది. ఇప్పుడు బలోగన్‌కు రెడ్ కార్డ్ రావడంతో డొమినోస్ తన మాటను నిలబెట్టుకుంది.
రెడ్ కార్డ్ వచ్చినా చారిత్రక విజయం
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బలోగన్‌కు రెడ్ కార్డ్ చూపినా అమెరికా జట్టుపై ప్రతికూల ప్రభావం పడలేదు. మ్యాచ్ ద్వితీయార్ధంలో బలోగన్ మైదానం వీడిన తర్వాత 82వ నిమిషంలో మాలిక్ టిల్‌మాన్ ఫ్రీ-కిక్‌తో మరో గోల్ సాధించి అమెరికా విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో బోస్నియాపై 2-0 తేడాతో గెలిచి, రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. గత 24 ఏళ్లలో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అమెరికాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ చారిత్రక విజయంతో పాటు ఉచిత పిజ్జాల ఆఫర్ రావడంతో అమెరికా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఉచిత పిజ్జా పొందడం ఎలా?
ఈ ఆఫర్ పొందడానికి డొమినోస్ కొన్ని నిబంధనలు విధించింది. జూన్ 10 రాత్రి 11:59 గంటలలోపు డొమినోస్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, 'డొమినోస్ రివార్డ్స్' కార్యక్రమంలో చేరిన వారికి మాత్రమే ఈ ఉచిత 'ఎమర్జెన్సీ పిజ్జా' లభిస్తుంది. అర్హులైన కస్టమర్లకు దీనికి సంబంధించిన సమాచారం అందుతుంది. వారు ఈ ఆఫర్‌ను జులై 2 లోపు రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్‌తో అదరగొట్టిన బలోగన్‌కు ఈ రెడ్ కార్డ్ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అతను చేసిన ఫౌల్ తీవ్రతను బట్టి అధికారులు అతనిపై రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ ప్రచారంలో భాగంగా డొమినోస్, 'సాటర్డేస్ ఫుట్‌బాల్' అనే సంస్థతో కలిసి ప్రత్యేకంగా జెర్సీలు, క్యాప్‌లు వంటి వస్తువులను కూడా విక్రయిస్తోంది. మొత్తానికి ఈ ఒక్క రెడ్ కార్డ్ అభిమానులకు రుచికరమైన పిజ్జాలను, డొమినోస్‌కు భారీ ప్రచారాన్ని అందించింది.