‘ఫస్ట్ నన్ను మోసం చేస్తాడు.. ఆపై ఫోన్ చేస్తాడు’.. చేతిలో బీర్ సీసాతో శపథాలు.. నెట్టింట హల్చల్ చేస్తున్న సియా వీడియో!
- సియా గోయల్ వైరల్ వీడియో కలకలం
- నైట్‌క్లబ్‌లో బీర్ తాగుతూ, ఫోన్లో బూతులు తిడుతున్న దృశ్యాలు వెలుగులోకి
- కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
- జులై 3 వరకు పోలీస్ కస్టడీలోనే సియా, ప్రియుడు చేతన్
గత డిసెంబర్ నాటిదిగా భావిస్తున్న ఆ వీడియోలో సియా పూణెలోని ఒక ప్రముఖ నైట్‌క్లబ్ (పబ్)లో చేతిలో బీర్ సీసా పట్టుకుని మద్యం తాగుతూ కనిపించింది. అంతేకాకుండా, ఫోన్లో ఎవరితోనో తీవ్రంగా గొడవపడుతూ.. "మొదట నన్ను మోసం చేస్తాడు.. ఆపై మళ్లీ నాకే ఫోన్ చేస్తాడు" అంటూ తీవ్రమైన పదజాలంతో బూతులు తిడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
లోహగఢ్ కోటపై ఘోరం
జూన్ 18న పూణె సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోటపై ట్రెకింగ్‌కు వెళ్లిన కేతన్ అగర్వాల్‌ను లోయలోకి నెట్టి హత్య చేశారనే ఆరోపణలపై సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిద్దరి పోలీస్ కస్టడీ జులై 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సియాకు సంబంధించిన నైట్‌క్లబ్ వీడియోలు, అలాగే చేతన్ చౌదరితో కలిసి ఆమె క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు బయటకు రావడం ఈ కేసుపై ఆసక్తిని మరింత పెంచింది.
ప్రేమ వ్యవహారం తెలియదన్న సియా తండ్రి
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పూణె రూరల్ పోలీసులు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్‌ను కూడా పిలిపించి విచారించారు. చేతన్ చౌదరితో తన కుమార్తెకు ఉన్న ప్రేమ వ్యవహారం గురించి తనకు ఏమాత్రం సమాచారం లేదని ఆయన పోలీసుల ఎదుట వాపోయారు. ఒకవేళ ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే విషయం తమకు ముందే తెలిసి ఉంటే, కేతన్ అగర్వాల్‌తో అసలు పెళ్లి సంబంధమే కుదిర్చేవాళ్లం కాదని ఆయన తెలిపారు.