ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్... 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఓటీటీలోకి రాబోతోంది
- జూలై 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం
- ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 6000 కోట్లకు పైగా వసూళ్లు
- భారత్‌లో 'డూన్ 2', 'ఇంటర్‌స్టెల్లార్' చిత్రాలను మించిన వసూళ్లు
ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 6,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ సినిమా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. భారత్‌లో వసూళ్ల పరంగా ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డూన్ 2’ వంటి భారీ చిత్రాలను అధిగమించడం విశేషం. గతేడాది విడుదలైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తర్వాత మన దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన అంతర్జాతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.
మానవాళిని కాపాడే క్రమంలో ఒక వ్యోమగామి ఒంటరిగా అంతరిక్షంలో చేసే సాహస యాత్రే ఈ చిత్ర కథాంశం. థియేటర్లలో భారీ విజయం సాధించడంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.