విజయ్ చివరి సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్?.. జులైలోనే ‘జన నాయగన్’!
- జులైలో ‘జన నాయగన్’ విడుదలయ్యే అవకాశం
- సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం వల్లే విడుదల వాయిదా
- ఈ నెలలో సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం
- విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన లేదు
- విజయ్ నటుడిగా చేసిన చివరి సినిమా ఇదే
ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ జాప్యం కావడంతో వాయిదా పడింది. గతేడాది డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపిన చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జన నాయకన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.