మనిషిలా హావభావాలు, మాట్లాడే రోబో: చైనా శాస్త్రవేత్తల సరికొత్త సృష్టి
- చైనా రోబోటిక్స్ సంస్థ 'యుబిటెక్' సరికొత్త ఆవిష్కరణ
- భావోద్వేగాలను గుర్తించే 'UWORLD U1' హ్యూమనాయిడ్ రోబో
- సిలికాన్ చర్మం, 88 జాయింట్లతో సహజసిద్ధమైన కదలికలు
- డేటా భద్రత కోసం ప్రత్యేక ఆన్-డివైజ్ స్టోరేజ్
- లాంచ్ అయిన కాసేపటికే 13,000 పైగా ఆర్డర్లు
అచ్చం మనిషిలాగే.. అద్భుత ఫీచర్లు
ఈ రోబోకు అచ్చం మనిషి చర్మం లాంటి అనుభూతిని ఇచ్చే సిలికాన్ స్కిన్‌ను అమర్చారు. ఇది పురుష రూపంలో (183 సెం.మీ), మహిళ రూపంలో (168 సెం.మీ) లభిస్తుంది. శరీరంలో అమర్చిన 88 సర్వో జాయింట్ల (కదలికల కీళ్లు) సాయంతో ఇది ఎంతో సహజంగా కదులుతుంది.
ఎమోషనల్ ఏఐ: ఈ రోబో మనుషుల్లోని 20కి పైగా విభిన్న భావోద్వేగాలను సులభంగా గుర్తిస్తుంది. మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూస్తూ సంభాషిస్తుంది. గతంలో జరిగిన సంభాషణలను గుర్తుంచుకుని, దానికి తగ్గట్టుగా సమాధానాలు ఇస్తుంది. మన పెదవుల కదలికలకు కేవలం 20 మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ఇది స్పందిస్తుంది.
ప్రైవసీకి ప్రాధాన్యం: వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం క్లౌడ్ స్టోరేజ్ కాకుండా, రోబో లోపల ఉండే రాక్‌చిప్ ఆన్-డివైజ్ ప్రాసెసర్‌లోనే డేటాను భద్రపరుస్తుంది. దీనివల్ల ప్రైవసీ లీక్ అయ్యే ప్రమాదం ఉండదు.
ధర.. డిమాండ్
ఈ రోబోలు లైట్, ప్రో, అల్ట్రా అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ. 14 లక్షల నుండి గరిష్ఠంగా రూ. 1.15 కోట్ల వరకు ఉన్నాయి. ఈ రోబోను లాంచ్ చేసిన కాసేపటికే ప్రపంచవ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం కొన్ని రోజుల్లోనే 13,000కు పైగా యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో రోబోలు కేవలం యంత్రాలుగా కాకుండా, మనుషుల దైనందిన జీవితంలో ఒక తెలివైన భాగస్వామిగా మారుతాయని యుబిటెక్ వ్యవస్థాపకుడు జేమ్స్ జౌ ధీమా వ్యక్తం చేశారు.