Yarlagadda Venkata Rao: ఒక్క చాన్స్ ఇవ్వండి.. గన్నవరం రూపు రేఖలు మారుస్తా: యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkata Rao asks for one chance
షార్ట్స్‌లో చూడండి
గన్నవరం నియోజకవర్గం నుంచి తనను గెలిపించాలని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే గన్నవరం రూపురేఖలను మారుస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న అరాచక శక్తుల ఆట కట్టిస్తానని అన్నారు. అవినీతిని అంతం చేస్తానని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు అండగా ఉంటానని చెప్పారు. రామవరప్పాడు గ్రామంలో కాల్వకట్టలపై నివసిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి (జనసేన)ని గెలిపించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గంలో చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు యార్లగడ్డ వివరించారు.
Go Back to Shorts
Yarlagadda Venkata Rao
Telugudesam
Gannavaram

More Telugu News