Advertisement

గన్నవరం వేదికగా చంద్రబాబుకు అవమానం జరిగింది.. ఇప్పుడు గిఫ్ట్ ఇద్దాం: యార్లగడ్డ వెంకట్రావు

Chandrababu has to become CM again says Yarlagadda Venkata Rao
  • గన్నవరంలో టీడీపీ జెండా ఎగరాలన్న వెంకట్రావు
  • చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమన్న వెంకట్రావు
  • ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విన్నపం
గన్నవరం నియోజకవర్గం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అవమానం జరిగిందని... ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ యార్లగడ్డ ఈ వ్యాఖ్యలు చేశారు. వెలమ సామాజికవర్గ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటానని చెప్పారు. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఎంపీగా బాలశౌరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Advertisement
Yarlagadda Venkata Rao
Gannavaram
Telugudesam
Chandrababu

More Telugu News