మరో నాలుగు రోజుల్లో సంచలనం జరగబోతోందంటూ ట్వీట్.. దీని మర్మమేంటో సీబీఐ తేల్చాలంటూ అయ్యన్నపాత్రుడి డిమాండ్
- మార్కెటింగ్ కన్సల్టెంట్ చేసిన పోస్ట్ ను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు
- చంద్రబాబు అరెస్ట్‌కు ముందు కూడా ఇలాంటి పోస్టే చేశారన్న అయ్యన్నపాత్రుడు
- గతంలో న్యాయమూర్తులను దూషించింది కూడా ఆయనేనన్న అయ్యన్న
- తనకు సంబంధం లేదన్న శ్రీధర్‌రెడ్డి
ఏప్రిల్ 12న పోస్టు అయిన ఈ ఫొటోను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు.. హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన జగన్ సన్నిహితుడు గతంలోనూ పలుమార్లు ఇలాంటి పోస్టులు చేశాడని గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా కూడా సంచలనం జరగబోతుందని ట్వీట్ చేశాడని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటిదే చేశాడని, దీని వెనక మర్మమేంటనేది సీబీఐ తేల్చాలని డిమాండ్ చేశారు.
వైరల్ అవుతున్న ఈ పోస్టుపై శ్రీధర్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ పోస్టును తాను పెట్టినట్టు టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపిస్తున్నారని, దీనిపై ఏపీ డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని కోరుకుంటునట్టు పేర్కొన్నారు.