సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

Niveditha announced as BRS candidate for Secunderabad Cantonment by election
  • దివంగత ఎమ్మెల్యే సాయన్న చిన్నకుమార్తె నివేదితకు అవకాశం
  • అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్
  • ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడంతో అనివార్యమైన ఉప ఎన్నిక
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

నివేదిత అక్క లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సాయన్న పెద్ద కుమార్తె అయిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించారు. అయితే ఈ మధ్యే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సాయన్న కుటుంబానికే అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గుచూపారు.
Go Back to Shorts
Niveditha
BRS
KCR
by election
Secunderabad Cantonment

More Telugu News