భారత్‌లో పెరిగిన 'అనారోగ్య ఆయుర్దాయం'.. నివేదిక వెల్లడించిన చేదు నిజాలు!
- ప్రపంచవ్యాప్తంగా పెరిగిన సగటు ఆయుర్దాయం
- ఆరోగ్యకరమైన జీవిత కాలంలో మాత్రం క్షీణత
- వ్యాధులు, వైకల్యాలతో గడిపే సమయం పెరుగుదల
- ది లాన్సెట్ జర్నల్‌లో పరిశోధనల ప్రచురణ
- భారత్‌లో 10.7 ఏళ్లకు చేరిన అనారోగ్యం
వైద్య రంగానికందిన ఆధునిక సాంకేతికత, మందుల వల్ల మానవుడి సగటు జీవితకాలం (ఆయుర్దాయం) క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఆరోగ్యంగా బతికే రోజులు మాత్రం తగ్గుతున్నాయని ఒక అంతర్జాతీయ పరిశోధన స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో ప్రజలు తమ జీవితంలో ఎక్కువ కాలాన్ని రకరకాల వ్యాధులు, శారీరక వైకల్యాలతో, నరకయాతన అనుభవిస్తూ గడుపుతున్నారని అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్’లో ప్రచురితమైంది.
పరిశోధకులు సేకరించిన వివరాల ప్రకారం.. 1990 నాటి గణాంకాలతో పోలిస్తే, మానవుడి మొత్తం ఆయుర్దాయానికి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే కాలానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా పెరిగింది. 1990లో ఒక మనిషి తన జీవితంలో అనారోగ్యంతో గడిపే సమయం సగటున 8.8 ఏళ్లుగా ఉండేది. కానీ, 2023 నాటికి ఈ సమయం ఏకంగా 10.7 సంవత్సరాలకు చేరుకుంది. అంటే మనుషులు జీవించే కాలం పెరుగుతున్నప్పటికీ, అందులో దాదాపు పదేళ్లకు పైగా సమయాన్ని ఏదో ఒక రోగంతో ఆస్పత్రులు, మందుల చుట్టూ తిరుగుతూనే గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితంలో అనారోగ్యంతో గడిపే సగటు సమయం శాతంలో చూస్తే 13.6 శాతం నుంచి 14.5 శాతానికి ఎగబాకింది.
ఈ అంతర్జాతీయ మార్పుల ప్రభావం భారతదేశంపై కూడా తీవ్రంగానే పడింది. మనదేశంలో 1990 ప్రాంతంలో సగటున 8.4 సంవత్సరాలుగా ఉన్న అనారోగ్య జీవన కాలం, 2023 నాటికి 10.7 ఏళ్లకు పెరిగినట్లు ఈ అధ్యయనం ప్రత్యేకంగా ఎత్తిచూపింది. ఆయుష్షు పెరగడం సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ, ఆ పెరిగిన కాలాన్ని వ్యాధులతో కాకుండా సంతోషంగా, ఆరోగ్యంగా గడిపేలా జీవనశైలిలో, పబ్లిక్ హెల్త్ విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.