Advertisement

జూబ్లీహిల్స్ భూవివాదం: సినీ నిర్మాతలు సి.కల్యాణ్, శివరామకృష్ణపై కేసు

C Kalyan and Siva Rama Krishna booked in Jubilee Hills land dispute case
  • జూబ్లీహిల్స్ భూవివాదంలో నిర్మాతలు సి. కల్యాణ్, శివరామకృష్ణపై కేసు
  • వ్యాపారవేత్త రవిశంకర్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
  • కోర్టు ఆదేశాలను ధిక్కరించి స్థలంలోకి ప్రవేశించారని ఆరోపణ
  • గేటు, తాళాలు పగలగొట్టి సిబ్బందిని బెదిరించారని ఫిర్యాదు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఓ భూవివాదం కలకలం రేపుతోంది. ఈ వివాదానికి సంబంధించి ప్రముఖ సినీ నిర్మాతలు సి. కల్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణ సహా పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

కేసు వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో గల ప్లాట్ నంబర్ 89 తమదేనంటూ సి.కల్యాణ్, శివరామకృష్ణ గతంలో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, జూన్ 10న తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సదరు స్థలం రవిశంకర్ స్వాధీనంలోనే ఉందని, అందులోకి ఎవరూ ప్రవేశించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిందితులు అక్రమంగా ఆ స్థలంలోకి చొరబడ్డారని రవిశంకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ ఉన్న గేటు, తాళాలను పగలగొట్టి, సామగ్రిని చెల్లాచెదురు చేయడమే కాకుండా.. సిబ్బందిని బెదిరించి, నిర్మించి ఉన్న గదిని ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.                                
Advertisement
C Kalyan
Burugupalli Siva Rama Krishna
Jubilee Hills Land Dispute
Hyderabad Police Case
Kanthamaneni Ravi Shankar
Tollywood Producers Case

More Telugu News