'మేమంతా సిద్ధం' పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఎన్నికల సమరశంఖం పూరిస్తున్న సీఎం జగన్
- మేమంతా సిద్ధం యాత్రలో ప్రొద్దుటూరులో మొదటి సభ
యాత్ర ప్రారంభానికి ముందు సీఎంజగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారు.
ఇక, మార్చి 28న నంద్యాలలో, మార్చి 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.