ప్రతిపక్షాల విమర్శలే బీజేపీ ప్రచార గీతం.. వీడియో ఇదిగో!
- లోక్ సభ ఎన్నికలకు కొత్త సాంగ్ విడుదల చేసిన బీజేపీ
- ‘మే మోదీ కా పరివార్ హూ’ అంటూ అన్ని రాష్ట్రాల ప్రజలతో వీడియో
- కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తూ సాగిన గీతం
దీనిపై మోదీ ఘాటుగా స్పందిస్తూ.. దేశంలోని 150 కోట్ల మంది జనం తన కుటుంబమేనని చెప్పారు. ఈ విమర్శను అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ‘మోదీ కా పరివార్’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అంతా తమ సోషల్ మీడియా ఖాతాలలో మే మోదీ కా పరివార్ అంటూ డీపీలు పెట్టుకున్నారు. తాజాగా ఇదే విమర్శను బీజేపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు తామంతా మోదీ కుటుంబమేనని చెబుతున్నట్లు ప్రచార గీతాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది.