Advertisement

అనంత్ అంబానీ చేతి గడియారాన్ని ఆసక్తిగా పరిశీలించిన మార్క్ జుకర్ బర్గ్ కుటుంబ సభ్యులు

Mark Zuckerberg and his family members surprised to see Anant Ambani watch
  • రాధికా రాధికా రాధికా మర్చంట్ ను పెళ్లాడుతున్న అనంత్ అంబానీ
  • గుజరాత్ లోని జామ్ నగర్ లో అట్టహాసంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
  • ప్రపంచం నలుమూలల నుంచి విశిష్ట అతిథుల రాక
  • పెళ్లంటే ఇదేరా అనిపించేలా సాగుతున్న సంబరం 
భారత సంపన్నుడు, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ ముందస్తు వెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ... తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్ ను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. 

గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకల్లో అడుగడుగునా అంబానీల వైభవం ప్రతిబింబిస్తోంది.  సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల వీడియోలే కనిపిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు ఈ సంబరాల్లో పొల్గొంటున్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సైతం కుటుంబ సమేతంగా జామ్ నగర్ లో వాలిపోయారు. 

కాగా, జుకర్ బర్గ్ ఫ్యామిలీని స్వయంగా కలిసిన అనంత్ అంబానీ వారికి జరుగుతున్న మర్యాదల గురించి, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి ప్రదేశాలన్నీ చూడాలనుకుంటున్నారా... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాను అని జుకర్ బర్గ్ ను అడిగారు. 

ఈ క్రమంలో, మార్క్ జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్... అనంత్ చేతికి ఉన్న ఖరీదైన డిజైనర్ గడియారాన్ని అత్యంత ఆసక్తిగా పరిశీలించడం వీడియోలో కనిపించింది. ఆ వాచ్ ఆడెమర్స్ ప్యూగట్ రాయల్ ఓక్ ఓపెన్ వర్క్ డ్ స్కెలెటన్ అని అనంత్ వివరించారు. అంతేకాదు, ఆ వాచ్ ఖరీదు రూ.14 కోట్లు అని చెప్పడంతో జుకర్ బర్గ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Advertisement
Anant Ambani
Watch
Mark Zuckerberg
Priscilla
Jam Nagar
Pre Wedding Celebrations
Gujarat
India

More Telugu News