వీడియో గేమ్స్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్న కాలేజీ విద్యార్థి!
- హైదరాబాద్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
- ఉరివేసుకొని చనిపోయిన యువకుడు
- ఆత్మహత్యకు నిర్ధిష్ట కారణం ఏంటో తెలియలేదన్న యువకుడి తల్లి
యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన వీడియో గేమ్స్ ఏవనేది కూడా తెలియరాలేదు. సూసైడ్ నోట్ రాయకపోవడంతో కారణం స్పష్టంగా వెల్లడికాలేదు. స్నేహితులు కూడా ఎలాంటి కారణాన్ని చెప్పలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. దాదాపు వారం రోజులుగా యువకుడు కాలేజీకి రావడంలేదని తెలిసిందని వివరించారు.