ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన గ్లోబల్ స్టార్
- భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన యంగ్ టైగర్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
ఇదిలావుంచితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ ఈ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘దేవర’ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పార్ట్-1 ఏప్రిల్ 5, 2024న విడుదల కాబోతోంది.