Advertisement

ఇన్ స్టాగ్రామ్ ను పోర్న్ సైట్ తో పోల్చిన ఎలాన్ మస్క్!

Elon Musk latest banter with Mark Zuckerburg
  • ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్
  • ట్విట్టర్ ను పోలిన థ్రెడ్స్ ను తీసుకొచ్చిన జుకర్ బర్గ్
  • జుకర్ బర్గ్, మస్క్ మధ్య మాటల యుద్ధం
  • ఓ నెటిజన్ కామెంట్ ను బలపర్చిన మస్క్
ఏదైనా ఒకే రంగంలో ఉన్న రెండు సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య వృత్తిగత వైరం ఉండడం సహజమే. మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ మధ్య కూడా అలాంటి స్పర్ధ కొనసాగుతోంది. మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లకు సొంతదారు కాగా, ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు. 

ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్, జుకర్ బర్గ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జుకర్ బర్గ్ ట్విట్టర్ ను పోలిన థ్రెడ్స్ ను తీసుకువచ్చాక... పరస్పర విమర్శల దాడి మరింత పెరిగింది. 

ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్క్ జుకర్ బర్గ్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ ను ఓ పోర్న్ సైట్ తో పోల్చారు. పేరులో తప్ప ఇంకెక్కడా తేడా లేదని, కంటెంట్ అంతా ఒకటే అనే విధంగా మస్క్ వ్యాఖ్యానించారు. 

సీబీ డోజ్ అనే యూజర్ ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ తో ఇదంతా మొదలైంది. ఇన్ స్టాగ్రామ్ కు ఓన్లీ ఫ్యాన్స్ కు మధ్య తేడా ఏదైనా ఉందంటే అది పేరులోనే అంటూ సీబీ డోజ్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ను ఎలాన్ మస్క్ సమర్థిస్తూ "భలే చెప్పావు" అని ప్రశంసించాడు.
Advertisement
Elon Musk
Mark Zuckerburg
Instagram
Twitter

More Telugu News