ఇన్ స్టాలో మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్.. దేని గురించంటే..!
- 50 వసంతాల సినీ ప్రస్థానం పూర్తిచేసుకున్న రైటర్ కు శుభాకాంక్షలు
- మరో 50 ఏళ్లు ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీలో కొనసాగాలని ఆకాంక్ష
- రైటర్ సత్యానంద్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి
ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు తదితర పెద్ద హీరోల సినిమాలకు సత్యానంద్ రైటర్ గా పనిచేశారు. ఇన్నేళ్లలో ఆయన 400 లకు పైగా సినిమాలకు పనిచేశారు. కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి, టక్కరి దొంగ.. వంటి సినిమాలకు సత్యానంద్ కథను సమకూర్చారు. ఇటీవల కాలంలో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, రవిబాబు ‘ఆవిరి’ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు.