Anjan Kumar Yadav: ముషీరాబాద్ నుండి పోటీ చేయమని అధిష్ఠానం చెప్పింది: అంజన్ కుమార్ యాదవ్

Anjan Kumar Yadav ready to contest from Musheerabad
షార్ట్స్‌లో చూడండి

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంతో మంది నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీని వీడినప్పటికీ తాను మాత్రం కొనసాగుతున్నానన్నారు. ముషీరాబాద్ నుండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి హేమాహేమీలు బరిలోకి దిగుతారని, అందుకే ఈసారి తనను పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని చెప్పారు. 

ముషీరాబాద్‌తో తనకు అవినాభావ సంబంధం ఉందని, అందుకే దీనిని ఎంచుకున్నట్లు తెలిపారు. తాను మాత్రమే నిలబడాలనుకోవడం లేదని, అధిష్ఠానం కూడా తననే పోటీ చేయమని చెప్పిందన్నారు. సర్వేల్లో తన పేరు వచ్చిందని చెప్పిందని, అందుకే తనకు టిక్కెట్ ఇస్తోందన్నారు. దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలు పార్టీ నుండి వెళ్లిపోయారని, కానీ మేం ప్రజలకు సేవ చేస్తూ పార్టీలోనే ఉన్నామన్నారు.
Go Back to Shorts
Anjan Kumar Yadav
Congress
musheerabad

More Telugu News