ఏడేళ్ల ప్రేమ.. మరొకరితో పెళ్లి ఆపాలంటూ ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు

ఏడేళ్ల ప్రేమ.. మరొకరితో పెళ్లి ఆపాలంటూ ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు

Seven years of love boyfriend pastes posters across village to stop wedding with another man
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రేమ పోస్టర్ల కలకలం
  • ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామంటున్న ప్రియుడు
  • యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో నిరసన
  • 16 తులాల బంగారం కోసం పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపణ
  • యువతి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో వెలసిన కొన్ని పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఒక యువతి, యువకుడి మధ్య గల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఈ పోస్టర్లు వివాదాస్పదం కావడంతో, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గ్రామానికి చెందిన ఓ యువతితో తాను గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నానని సదరు యువకుడు ఆ పోస్టర్లు ద్వారా పేర్కొన్నాడు. తమ ప్రేమ విషయం తెలిసినప్పటికీ, ఆమె తల్లిదండ్రులు బలవంతంగా వేరొకరితో వివాహం నిశ్చయించారని ఆరోపించాడు. అంతేకాకుండా, తమ ప్రేమ వ్యవహారం గురించి కాబోయే వరుడికి చెప్పినప్పటికీ, అతడు 16 తులాల బంగారం తీసుకుని ఈ పెళ్లికి అంగీకరించాడని ఆ యువకుడు ఆరోపణలు గుప్పించాడు.

యువకుడు, యువతితో పాటు కాబోయే వరుడి ఫోటోలతో కూడిన ఈ పోస్టర్లను గ్రామ కూడళ్లు, గోడలపై అంటించడంతో అవి గ్రామస్థుల దృష్టిని ఆకర్షించాయి. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లలో పేర్కొన్న ఆరోపణల వాస్తవికతపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Advertisement
Rajanna Sircilla
Thangallapalli village
Lover posters viral
Seven years love story
Forced marriage protest

More Telugu News