చేతిలో గరుడ రేఖ.. చనిపోయాడనుకుంటే లేచి కూర్చున్నాడు!
- కర్ణాటకలోని గదగ జిల్లా హీరేకొప్ప గ్రామంలో వెలుగు చూసిన ఘటన
- మద్యం మత్తులో పామును పట్టుకున్న వ్యక్తి
- చేతిలో గరుడ రేఖ ఉన్న తనను పాము కాటేయదని ప్రకటన
- పాము నాలుగు సార్లు కాటేయడంతో కుప్పకూలిన వైనం
- అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మళ్లీ లేచి కూర్చున్న వ్యక్తి
- ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుడు
ఇదేమీ పట్టించుకోని సిద్ధప్ప పామును తీసుకుని గ్రామం వెలుపలకు వెళతూ మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా సిద్ధప్ప లేచి కూర్చున్నాడు. దీంతో, షాకైపోయిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిద్ధప్ప కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.