భారత సంతతి ఉపాధ్యాయురాలిపై బ్యాన్ విధించిన బ్రిటన్ పాఠశాలలు.. కారణమేంటంటే..!
- బ్రిటన్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పని చేస్తున్న దీప్తి పటేల్
- బీమా నకిలీ క్లెయిమ్ ను దాచి ఉద్యోగంలో చేరిన దీప్తి
- విషయం బయటపడటంతో షాక్ అయిన పాఠశాల యాజమాన్యం
అయితే, ఆమెపై ఇటీవల కోర్టు జరిపిన విచారణలో బీమా క్లెయిమ్ నకిలీదని నిరూపణ అయింది. దీప్తిపైనే దోపిడీ కేసు ఉందని వెల్లడయింది. వాస్తవానికి బీమా క్లెయిమ్ కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లినప్పుడు కూడా ఆమె స్కూల్లో అబద్ధం చెప్పే వెళ్లింది. ఈ విషయం బయటపడటంతో స్కూల్ యాజమాన్యం షాక్ కు గురైంది. టీచర్ల చెడు ప్రవర్తనపై చర్యలు తీసుకునే ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై రెండేళ్ల నిషేధం విధించారు.