Sumalatha: సీనియర్ నటి సుమలత కొడుకు పెళ్లిలో ప్రముఖుల సందడి.. ఇవిగో ఫొటోలు

  • బెంగళూరులో సుమలత కుమారుడు అభిషేక్‌, అవివా వివాహం
  • హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, రజనీకాంత్, మోహన్ బాబు, రఘురామకృష్ణరాజు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
sumalatha son wedding pics goes viral

సీనియర్‌ నటి, ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో అభిషేక్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ప్యాలెస్‌ ఇందుకు వేదికైంది. సోమవారం ఉదయం జరిగిన వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేజీఎఫ్ స్టార్ యశ్, కిచ్చా సుదీప్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

చిన్న వయసులోనే నటిగా అడుగుపెట్టిన సుమలత.. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. కన్నడ నటుడు అంబరీశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అంబరీశ్‌ మరణం తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.




More Telugu News