జూన్ 8 నుంచి 10 వరకు తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్

Fish Food Festival in Telangana from June 8th to 10th
  • తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్
  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ
  • 20 నుంచి 40 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి తలసాని
వచ్చే నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణపై సచివాలయంలో మంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఈ ఫెస్టివల్‌ను  నిర్వహిస్తామన్నారు. స్వయం ఉపాధి కోసం మత్స్యకార మహిళలకు చేపలతో వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఈ ఫెస్టివల్‌లో 20 నుంచి 40 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అలాగే, మత్స్య రంగానికి సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించనున్నట్టు మంత్రి తెలిపారు.
Go Back to Shorts
Telangana
Fish Food Festival
Talasani

More Telugu News