SSC Results: వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు!

telangana ssc and inter results to be announced next week
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అనధికారిక వర్గాల సమాచారం మేరకు వచ్చే వారంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది. ఫలితాల ప్రాసెసింగ్ తుది దశలో ఉందని అధికార వర్గాల సమాచారం. 

ఈ నెల 10న ఇంటర్మీడియెట్ ఫలితాలు, 12న పదో తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 5,05,625 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలను 7,39,493 మంది విద్యార్థులు రాశారు.
Go Back to Shorts
SSC Results
inter results
Telangana
inter board
Telangana students

More Telugu News