తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. ఐఎండీ అలర్ట్
- నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు
- ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన
- గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు
అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు అందివచ్చిన పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయంగా మారిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.