నిఖత్ జరీన్‌కు ‘థార్’ బహుమతి.. అందించిన మహీంద్రా ఆటోమోటివ్!
- 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్‌పై నిఖత్ అద్భుత విజయం
- ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును గెలుచుకున్న నిఖత్
- భారత క్రీడా చరిత్రలో నిఖత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందంటూ మహీంద్రా ట్వీట్
స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. నిఖత్ తెలంగాణకు గర్వకారణమని, ఆమె తన విజయాలతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని కొనియాడారు.
కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్ ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును కూడా గెలుచుకుంది. ఎదురనేదే లేకుండా భారత క్రీడా చరిత్రలో నిఖత్ సరికొత్త అధ్యయాన్ని లిఖించిందని ప్రశంసిస్తూ మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. ఆమె అద్భుతమైన ప్రతిభకు గాను కొత్త థార్ కారును అందిస్తున్నట్టు పేర్కొంది.