అలెర్ట్! తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!
- తెలంగాణలో మారిన వాతావరణం
- నిన్న పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
- అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బ తిన్నాయి.