నెట్ లో ఆ కంటెంట్ చూసినా, వెతికినా జైలుకే.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక
- చైల్డ్ ఫోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్నవారి సంఖ్య
పెరుగుతున్న వైనం - వారిపై నిఘా పెడుతున్న జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
- రాష్ట్రంలో నెల రోజుల్లోనే 43 మంది అరెస్ట్
ఈ క్రమంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీశామ్)ను ఆన్‌లైన్‌లో చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు సైతం దీనికి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు. అయితే, మనదేశంలో సీశామ్ ఫైల్స్ చట్టవిరుద్ధమని, సెక్షన్ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హులని తెలంగాణ సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్‌లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయన్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపితమైతే ఏడేండ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు.